చివరికి విధ్యార్థులదే విజయం, దిగివచ్చిన ప్రభుత్వం.

intermediate-telangana-results-issue-cleared

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లోని అవకతవకలు మనందరం చూస్తున్నావ్, అయితే ఇందులో ఎంతో మంది విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రులు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ముందు ప్రభుత్వం ఈ విషయాన్నీ సరిగ్గా పట్టించుకోలేదు కానీ రోజు రోజుకి ఈ విషయం ఇంకా వేడెక్కుతూ వచ్చింది.

ఆరు వందలు కట్టి రెవెల్యూయేషన్ పెట్టుకో అన్న కొందరి అధికారుల నొరులకి సరిఅయిన సమాధానం ప్రభుత్వం నుండి వచ్చింది. తెలంగాణ CM కెసిఆర్ గారు ప్రతి ఫెయిల్ అయినా విద్యార్ధి పేపర్ ఉచితంగా రేకర్రెక్షన్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ విషయం లో ఎంతో మంది సంతోషం వ్యక్తం చేసారు.

ఇదంతా ఒకవైపు విషయం అయితే, మరో వైపు 17 మంది పిల్లలు ఇంటర్ లో ఫెయిల్ అయ్యారు అని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రెవెల్యూయేషన్ చేసినంత మాత్రాన వీరి ప్రాణం తిరిగిరాదు. అసలు వీరి చావుకు కారణం కేవలం ఇంటర్ బోర్డు మాత్రమే కాదు, వారి పైన చదువు భారం మరి ప్రాణాల విలువ కంటే ఎక్కువ చేసిన వారిది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, చదువు మాత్రమే జీవితం కాదు. జీవితం లో చదువు ఒక భాగం మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *