You are here
Home > News

అభినందన్ ను తిరిగి పంపించము అని హై కోర్ట్ లో కేసు వేసిన పాకిస్థాన్

abhinadhan wagha border

మన అభినందన్ వర్ధమాన్ గారిని ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు తిరిగి పంపించేస్తాం అని మాట ఇచ్చిన అక్కడ పాకిస్తాన్ లో అందరి మాట ఆలా లేదు. పాకిస్తాన్ లో కొందరు మంత్రులు ఈ సంఘటన పైన పార్లమెంట్ బొయికాట్ చేయడం జరిగింది. అక్కడ ఫారిన్ మినిస్టర్ షా మహ్మద్ ఖురేషి కి ఇష్టం లేదు. అక్కడ హై కోర్ట్ లో కూడా ఈ సంఘటన పైన కేసు వేయడం జరిగింది అని తెలిసింది.

ఏది ఏమైనా మన భారత సింహం తిరిగి వచ్చేయడం కాయం అన్నది తెలుసుతు వుంది. వాఘ అటారీ బోర్డర్ లో మన వాళ్ళు అందరూ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. లక్షల మంది బోర్డర్ కి వచ్చి అభినందన గారికి స్వాగతం పలుకుతున్నారు. రావల్ పిండి లో వున్నా అభినందన గారిని వాఘా బోర్డర్ కి ప్రత్యేక విమానం లో తీసుకురావడం జరుగుతుంది. గతం లో కార్గిల్ యుద్ధం లో ఇలాంటి సంఘటనలో మన సైనికుడు నచికేత విషయం లోను ఇదే పద్ధతి పాటించడం జరిగింది.

పాక్ సైన్యం అభినందన్ ను అప్పగించిన వెంటనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఇప్పటికే వాఘా బార్డర్ లో సంబరాలు చేసేందుకు అనుమతి తీసుకున్నారు

Leave a Reply

Top