ఏది నిజం ? ఏది అబద్ధం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మాటల్లో !! పూర్తి విశ్లేషణ !!!

wing comander abhinadhan

#ఏది నిజం ? ఏది అబద్ధం ?

#1960-70 లో తయారైన జెట్ ఫ్లైట్ ని ఇంకా మనం ఎందుకు వాడుతున్నాం ?
అసలు అంత బలహీనమైన జెట్ ని F 16 ని ఎదుర్కొనడానికి పంపాల్సిన అవసరం ఎం వచ్చింది ?

#వింగ్ కమాండర్ అభినందన్ కూల్చిన విమానం ఏంటి? ఆ పైలెట్ పరిస్థితి ఏంటి ?

#అసలు ఎం జరిగింది? మన MiG 21 ని కూల్చిందెవ్వరు ?

# మన aircraft అక్కడ కూలినప్పుడు అక్కడ పరిస్థితులేంటి ?

#అసలు మన పైలెట్ పాకిస్థాన్ సివిలియన్స్ కి దొరకకపోతే, వాళ్ళు సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేయకుంటే, వింగ్ కమాండర్
అభినందన్ వర్థమాన్ ని జెనీవా ఒప్పందం ప్రకారం, మనకి 24 గంటల్లోనే అప్పజెప్పేవారా ?

#వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మాటల్లో !!!!

పూర్తి విశ్లేషణ !!!

________________________________________________________________________________________________________________________________________________

1960-70 లో తయారైన MiG 21 ని మనం ఇంకా ఎందుకు వాడుతున్నాం ? అసలు అంత బలహీనమైన జెట్ ని F 16 ని ఎదుర్కొనడానికి పంపాల్సిన అవసరం ఎం వచ్చింది ? అంటే,

MiG 21 ని కొన్ని సంవత్సరాల క్రితం Modify చేసి MiG 21 Bision గా మార్చారు అయితే ఈ MiG 21 కి దేనికి లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది శత్రువులను గుర్తించడం లో ఇది దిట్ట రాడార్ సహాయం ధ్వారా శత్రువుల యుద్ధ విమానాలను పసిగట్టగానే అత్యంత వేగంగా శత్రువుల పైకి దూసుకెళ్లడం లో MiG 21 Bision తరవాతే మారే యుద్ధ విమానం అయినా ఇంజన్ స్టార్ట్ అవడం లో అతి తక్కువ సమయం తీసుకునే ఏకైక యుద్ధ విమానం MiG 21, శత్రువుల రాకను పసిగట్టిన తరువాత ఎంత వేగంగా వారిని ఎదుర్కొన్నామన్నదే ప్రాముఖ్యం అందుకని ఇంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న యుద్ధవిమానాలు మన దగ్గర ఉన్నపటికీ MiG 21 Bision ని పంపవలిసి వచ్చింది . MiG 21 Aircrafts మన భారతీయ వాయు సేన దగ్గర చాల తక్కువ పరిమాణం లో నే ఉన్నాయి. Day by day the MiG 21 aircrafts are going to obsolete.

 

Mig21 Bision

వింగ్ కమాండర్ అభినందన్ కూల్చిన విమానం ఏంటి? ఆ పైలెట్ పరిస్థితి ఏంటి ?

మీడియా మరియు సోషల్ మీడియా కథనాల ప్రకారం 12 F16 జెట్స్ తో వాళ్ళు యుద్ధనికి దిగారు అన్నది వార్త. అందులో ఒక F16 యుద్ధ విమానాన్ని మన వింగ్ కమాండర్ అభినందన్ కూల్చిన విషయం వాస్తవమే. కానీ యుద్ధం లో కొన్ని విషయాలు గుప్తంగా ఉంచాల్సి వస్తుంది. అందుకు గాను పాకిస్థాన్ మొదట్లో వాళ్ళ యుద్ధవిమానం కూలిపోయిందని ఒప్పుకోలేదు. తరువాత ఒప్పుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ యుద్ధవిమానం పైలట్ కూడా ప్యారాచూట్ ధ్వారా ఎజెక్ట్ అయి తప్పించుకున్నాడు ప్యారాచూట్ ధ్వారా ల్యాండ్ అయ్యే సమయం లో ప్రదేశం అనుకూలించక పోవడం తో తీవ్ర గాయాల పాలయ్యాడు ( అతన్ని కూడా ఇండియన్ పైలట్ అనుకోని అక్కడి ప్రజలు చితకబాదిన విషయం సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం మనందరికి తెలిసిందే ) గురువారం సాయంత్రం హాస్పిటల్ లో మరణించాడని సమాచారం

f16 pakisthan

అసలు ఎం జరిగింది? మన MiG 21 ని కూల్చిందెవ్వరు ?

F 16 యుద్ధ విమానం పైలట్ గా శిక్షణ పొందిన Sqn Ldr హాసన్ సిద్దికీ మన MiG 21 Bision ని కూల్చివేయడం జరిగింది Sqn Ldr హాసన్ సిద్దికీ F 16 యుద్ధ విమానం లో శిక్షణ పొందిన పైలట్ ల లో ఒకరు ఇతను కరాచీ ఉస్మాన్ పబ్లిక్ స్కూల్ లో 10 + 2 పూర్తి చేసుకొని పాకిస్థాన్ డిఫెన్స్ అకాడమీ లో జాయిన్ అయి F 16 యుద్ధ విమానం పైలట్ గా శిక్షణ పొందారు, అభినందన్ చాకచక్యాం వాళ్ళ, హాసన్ సిద్దికీ వదిలిన ఎయిర్ to ఎయిర్ మిస్సైల్, MiG 21 Bision ని పూర్తిగా ధ్వంసం కాకుండా చేసే ప్రయత్నం లో ఆ మిస్సైల్ wing కు తగలడం వల్ల తప్పనిసరి పరిస్థితులలో ఎజెక్ట్ అవ్వాలిసి వచ్చింది ఆ తరువాత Sqn Ldr హాసన్ సిద్దికీ పాకిస్థాన్ హీరో అవ్వడం తెలిసిందే Sqn Ldr హాసన్ సిద్దికీ పేరు మీద పాకిస్థాన్ లో ప్రత్యక పూజలు సంబరాలు చేశారు

f16 pilot pakisthan

మన aircraft అక్కడ కూలినప్పుడు అక్కడ పరిస్థితులేంటి ?

మన aircraft కూలిన వెంటనే ఎజెక్ట్ అయినా అభినందన్ పారాచూట్ సహాయంతో మెల్ల మెల్లగా దిగుతుండగా సిందోడ్ గ్రామ ప్రజలు చూడడం జరిగింది. ఈ గ్రామం LOC కి ఏడూ కిలోమీటర్ల దూరం లో ఉంది. ముందుగానే ఇన్ఫోర్మ్షన్ ఉన్న పాకిస్థాన్ ఆర్మీ మేజర్ ప్యారాచూట్ ను TRACE చేస్తూ గ్రామ ప్రజల సహాయంతో అభినందన్ ని చుట్టుముట్టడం జరిగింది, అంతకు ముందు సేఫ్ గా ల్యాండ్ అయినా అభినందన్ అక్కడి ప్రజలతో ” యే హిందుస్థాన్ మే కౌంసా ఇలాకా హై ! “ అని అడిగాడు అక్కడి ప్రజలు ఎం మాట్లాడక పోవడం తో ఇది హిందుస్థాన్ ఆ లేక పాకిస్థాన్ ఆ అని అడిగాడు ఎం అర్థం కానీ అక్కడి ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఇది హిందుస్థాన్ అని చెప్పడం జరిగింది వాళ్ళ మాటలతో సంశయించిన అభినందన్ జై హింద్ అని నినాదాలు చేశాడు దాంతో ఉక్రోశించిన పాకిస్థాన్ వాసులు పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్ అని వారి భాషలో నినాదాలు చేశారు.
దాంతో వెంటనే అభినందన్ తన దగ్గర ఉన్న విలువైన మ్యాప్ మరియు డాకుమెంట్స్ ని దాచేయడం కోసం పరుగెత్తడం జరిగింది దాంతో ఆ ప్రజలు అభినందన్ ని వెంబడించారు. అంతే కాక రాళ్లు రువ్వడం తో అభినంధన్ పిస్టల్ తీసి గాల్లో ఫైర్ చేశాడు .
ఎలాగూ దొరికిపోయాను అని గ్రహించిన అభినందన్ తన దగ్గర ఉన్న విలువైన డాకుమెంట్స్ ని నీటిలో పడి వేయడం జరిగింది తరువాత గ్రామ ప్రజలు అభినందన్ ను పట్టుకొని దాడి చేసి పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది

Abhinadhan

 

అసలు మన పైలెట్ పాకిస్థాన్ సివిలియన్స్ కి దొరకకపోతే, వాళ్ళు సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేయకుంటే, వింగ్ కమాండర్
అభినందన్ వర్థమాన్ ని జెనీవా ఒప్పందం ప్రకారం, మనకి 24 గంటల్లోనే అప్పజెప్పేవారా ?

అప్పజెప్పేవారా అంటే కాదనే చెప్పవచ్చు అసలు పాకిస్థాన్ కు అప్పచెప్పే ఉద్దేశం ఉండదు ఎందుకంటే 1971 యుద్ధం లో పాకిస్థాన్ చిత్తు గా ఓడిపోయింది ఆ సమయం లో భారత్ కి కొన్ని వేల మంది సైనికులు పట్టు బడితే ఉదారంగా వదిలి పెట్టింది కానీ పాక్ తనకి చిక్కిన 54 మంది భారత సైనికుల్ని ఇప్పటికి వదలలేదు సరికదా… వాళ్లు అసలు బ్రతికిఉన్నారో లేదో ప్రపంచానికి తెలియనివ్వటం లేదు. కులభూషణ్ జాదవ్ గురించి మనకు తెలిసిందే 3rd మార్చ్ 2016 రోజు బలూచిస్తాన్ లో జరిగిన కౌంటర్ ఇంటిలిజెన్స్ ఆపరేషన్ లో పట్టుబడిన జాదవ్ ను ఇప్పటివరకు చిత్రహింసలు చేస్తున్న విషయం తెలిసిందే ! అది పాకిస్థాన్ యొక్క వక్రబుద్ధి.
అలంటి దేశం ఇప్పుడు తనకు చిక్కిన అభినందన్ ని విడిచి పెట్టింది అంటే ఆ క్రెడిట్ పాకిస్థాన్ ధీ కాదు ప్రపంచదేశాల ఒత్తిడి మరియు పాకిస్థాన్ బలిహీనమైన ఆర్ధిక వ్యవస్థ నే కారణం. ముక్యమైన విషయం ఏంటంటే అక్కడి ప్రజలకు దొరకడం వళ్ళ వారు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వల్ల ఆ విషయం అంతర్జాతీయ మీడియా కు తెలిసింది ఆ కారణం చేత పాకిస్థాన్ అధికారులు అభినందన్ తమ ఆధీనం లో ఉన్నాడని ఒప్పుకోవడం జరిగింది.

@Kittzz_Mady

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *