You are here
Home > Movies

తప్పక చూడవలసిన 4 కొత్త ట్రైలర్లు

మహానాయకుడు

మహానాయకుడు అనే సైన్మా కథానాయకుడు పోయినంక అతున్న సైన్మా అసలే రాంగోపాల్ వర్మ నేనే నిజం చెప్తాన్న అని లక్షిస్ ఎన్టీఆర్ ముందుగల ట్రైలర్ రిలీజ్ చేసిండు ఇప్పటికే లచ్చలు లచ్చలు వ్యూస్ దాటినాయి కానీ పెద్ద పెద్ద నటులున్న మహానాయకుడు ఇంకెన్ని లచ్చలు దాటుతదో ముంగట సూడలే

పెద్దయిన ఎన్టీఆర్ వేషంలో నందమూరి బాలకృష్ణ నటన అద్భుతం చంద్రన్న పాత్రలో రానా కూడా చింపినట్టే కనిపిస్తుంది రాజకీయంగా ఓ ఊపు ఊపిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర మల్ల సుసుడు తెలుగు ప్రజల అదృష్టం అనే చెప్పాలి

ఈ సైన్మా ని తీసింది క్రిష్ జాగర్లమూడి అయితే మాటలు రాశింది సాయి మాధవ్ బుర్ర ఇగ సప్పుడు కొట్టింది ఎం ఎం కీరవాణి సారు వారాహి చలన చిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నా ఈ సైన్మా లో నందమూరి బాలకృష్ణ తో సహా విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, పూనమ్ బజ్వా, రానా దగ్గుబాటి, ఇంకా మంచి మంచోళ్ళు ఉన్నారు ఫిబ్రవరి 22 తారీకు అస్తున్న ఈ సైన్మా ను మార్షిపోకుండా జప్పున సూడుండ్రి మహానాయకుడు ట్రైలర్ సుడలంటే ఈ కింది లింకు నొక్కురి.

ఫలక్ నుమ దాస్

ఫలక్ నుమ దాస్ అబ్బబ్బ ఏమన్నా ఉన్నదా ట్రైలర్ అచ్చం మన పక్కింటి పోరగండ్లు మాట్లాడుకున్నట్ట్టు పోట్లాడుకున్నట్టు మన జీవితం అనే సైన్మా లో ఎట్లుంటదో గట్లనే ఉన్నదీ

ఇదో పెద్ద రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ కరాటే రాజు తీసిన ఈ సైన్మా ట్రైలర్ మస్తు చంకాయిస్తుంది అమ్మతోడు విశ్వక్ సేన్ చింపిండు ఇగ వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా మస్త్ ఉంది అనుకో

ఈ సైన్మా ల ఇంకా ఏముందో గాని నటించినోళ్లు అయితే విశ్వక్ సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి, మరియు ఉత్తేజ్ తరుణ్ భాస్కర్ కూడా మస్తచేసిర్రు అని చెపుతుర్రు

సిన్మా మాత్రం మర్చి 22 నాడు అత్తంది పోరగండ్లు ఎవ్వలు మిస్ కావద్దు

చిన్న సిన్మా లల్ల లొల్లి సిన్మా ఇది ట్రైలర్ ఇప్పటికే లచ్చల వ్యూస్ దాటింది ఏ అంగెల్ ల చుసిన సిన్మా మస్తు ఉండే తట్టే కొడుతంది ఫలక్ నుమా దాస్ ట్రైలర్ సూడాలనుకుంటే ఈ కింది లింక్ నొక్కుర్రి

 

 

4 లెటర్స్

నాలుగు లెటర్లు అంటే నాలుగు ఇన్లాండ్ లెట్టర్లు కాదు నాలుగు లెట్టర్లు అంటే LOVE అంట
ముగ్గురు పోరగన్ల మధ్య తిరిగే ప్రేమ స్టోరీ నాలుగు లెటర్లు ఇందులో ఇంజినీరింగ్ పోరడు అజయ్ మల్ల మ్యూజిక్ పోరి అంజలి ఫాషన్ డిజైన్ పోరి అనుపమ ఇళ్ల మధ్యల నడిచే రొమాంటిక్ స్టోరీ నాలుగు లెటర్లు

ఫిబ్రవరి 22 తారీకు మీముందుకు వస్తున్నా ఈ సైన్మా కాలేజ్ పోరగండ్లకు నచ్చేటట్టే ఉన్నదీ రఘురాజ్ డైరెక్షన్ ల మీముందుకు ఆతున్న ఈ సైన్మకు ఉదయ కుమార్ ప్రొడ్యూసర్ నాలుగు లెటర్లు ట్రైలర్ చూడాంలంటే కింద ఉన్న లింకు నొక్కుర్రి

అంజలి సిబిఐ

అంజలి సిబిఐ లో నయనతార మస్త్ శేషింది సైకో కిల్లర్ స్టోరీ తో మీ ముందుకు వస్తున్నా ఈ సైన్మా మంచి త్రిల్లర్ యాక్షన్ ను తెలుగు ప్రేక్షకులకు సూపెట్టబోతుంది ఎవరు కిల్లర్ అని కథాంశం తో మీముందుకు వస్తున్నా సైన్మా లో నయనతార, అనురాగ్ కశ్యప్, రాశికన్నా. తారాగణం తో ఫిబ్రవరి 22 తారీకు మీముందు వస్తున్నా ఈ సైన్మా ఆద్యంతం క్రైమ్ స్టోరీ తో అలరించనుంది

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం లో సీజే జయ కుమార్ ప్రొడ్యూసర్ గా హిప్ హాప్ తమిజా మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్నా ఈ సైన్మా థియేటర్ ట్రైలర్ సూడాలంటే ఈ కింద ఉన్న లింకు ను నొక్కురి

 

Leave a Reply

Top