You are here

65 వసంతాలు పూర్తిచేసుకుని 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కెసిఆర్ స్పెషల్ స్టోరీ

65 వసంతాలు పూర్తిచేసుకుని 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కెసిఆర్ స్పెషల్ స్టోరీ

చిన్ననాటి నుండే కెసిఆర్ కి రాజకీయాలు అంటే చాల ఆసక్తి. ఎలాగైనా తాను ఒక్క మంచి రాజకీయ నాయకులూ కావాలని అతని కోరిక. ఇప్పుడు ఈ స్థాయి లో ఉన్నాడు అంటే అతని యొక్క మంచితనం ముక్కుసూటి తత్త్వం దయాగుణం, ఎవరికి భయపడని ధైర్యవంతుడు వెనకడుగు వెయ్యని మహాత్ముడు.


చూస్తుండగానే 18 ఏళ్లు క్షణాల్లా గడిచిపోయాయి. చూస్తుండగానే బక్కపలుచనిగా ముద్రపడ్డ మనిషి.. మహా స్ట్రాంగ్ గా మారిపోయారు. చూస్తుండగానే వెనుకబడ్డ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ఇదంతా కూడా కేసీఆర్ దార్శనికతకు అద్దంపట్టే పరిణామ క్రమం. సమైక్య పాలనలో తెలంగాణను అణగదొక్కుతున్నారంటూ గళమెత్తి నినదించిన ఉద్యమనేత రాజకీయ ప్రస్థానానికి 2001లో బీజం పడింది. తెలంగాణ సాధించడం అంతా ఈజీ కాదు, అసలు నీవల్ల తెలంగాణే రాదు అంటూ ఎన్నో నోళ్లు పెదవి విరిచాయి. తెలంగాణ రాష్ట్ర సాధనను తన భుజానికెత్తుకున్న కేసీఆర్.. ఆ నోళ్లను పట్టించుకోలేదు అదే పట్టుదలతో ముందుకెళ్లి చివరకి అనుకున్నది సాధించి తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చారు.

ప్రజల సంక్షేమమే ద్యేయం

రాష్ట్రం వచ్చిన తరువాత తాను ఇచ్చిన హామీలను చేసి పెట్టాడు. అంతే కాదు ఎక్కడ లేని అటువంటి ఎన్నో పథకాలను అమలు చేసాడు. 65 వసంతాలు నిండిన కూడా.. ఎక్కడా లేని ఎనర్జీ ఆయన సొంతం. ఆయన ఓపిక, నడవడి.. ప్రతిదీ స్ఫూర్తిదాయకమే.
ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలకంటే వంద రెట్లు ఆయనకు అధికంగా ఉన్నాయనే వారు లేకపోలేదు. 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, వృద్ధులకు పింఛన్లు, ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, రూపాయికే కిలో బియ్యం, హాస్టళ్లల్లో సన్నబియ్యం, పరిశ్రమలకు సత్వర అనుమతి, అణగారిన వర్గాలకు చేయూత.. ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలు తీర్చే ముఖ్యమంత్రిగా ముద్రవేసుకున్నారు. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారి మెజారిటీ తో మరోసారి పగ్గాలు అప్పచెప్పారు. అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టి ప్రజల మనుసులో చిరకాలం నిలిచిపోయాడు.


భరతమాత ఒడిలో 29వ బిడ్డగా అవతరించిన తెలంగాణ.. నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధి బాట పట్టింది. కేసీఆర్ మార్గదర్శకత్వంలో దూసుకెళుతున్న తెలంగాణను ఆయా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. సంక్షేమ పథకాల తీరును ఫాలో అవుతున్నాయి. ఒకనాడు ఉద్యమ నేతగా ఎన్నో అవమానాలు భరించిన కేసీఆర్.. ఇప్పుడు ఒక్క మంచి ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక లేదని భావించిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్‌తో ముందుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును.. దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది ఆయన అంతరంగం. మొత్తానికి వ్యక్తిగా 65 సంవత్సరాలు నిండిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో మరో శక్తిగా ఎదగడంలో ఏమేర సఫలీకృతులవుతారో చూడాలి.

Leave a Reply

Top