యాదగిరి శేఖర్ రావు కు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తెలంగాణా రాష్ట్రసమితికి లాభమా నష్టమా ?

యాదగిరి శేఖర్ రావు కు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తెలంగాణా రాష్ట్రసమితికి లాభమా నష్టమా
ట్రస్మా తో ఉన్న సంబంధాల కారణంగా యాదగిరి శేఖర్ రావు నాలుగు జిల్లాలు అయినా, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ , కరీంనగర్ ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతున్నాడు అత్యధిక సంఖ్య లో పట్టభద్రులను ఓటర్లు గా నమోదు చేయించాడు,

ఈయనకున్న సంబంధాల వల్ల రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితికి నాలుగు జిల్లాల పార్లమెంట్ పరిధి లో ఓట్ల శాతం మరింతగా పెంచుకోవచ్చు అనటం లో అతియోశక్తి లేదు,

తెలంగాణా రాష్ట్రం సాధన సమయం లో ఉద్యమం తో పాటు తెలంగాణ ఆవిర్భవించాక ప్రభుత్వానికి మద్దతుగా సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం లో ట్రస్మా కీలక భాగస్వామ్యం అయింది,

ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం లో యాజమాన్యాల సాధక బాధకాలను ప్రభుత్వానికి వినిపించే తగిన ప్రాతినిధ్యం లేక సదరు సంస్థలు పలు ఇబ్బందులకు గురయ్యాయి

ఈ సందర్భం లో 2018 శాశనసభ ఎలక్షన్స్ లో 31 జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసి రెండో సారి పార్టీ విజయానికి పాటుపడి రాబోయే పార్లమెంట్ ఏక్టన్స్ లో సైతం 16 నియోజకవర్గాలలో ట్రస్మా తరుపున పార్టీ విజయానికి కృషి చేయడం లో ట్రస్మా కీలక పాత్ర పోషించనుంది యాదగిరి శేఖర్ రావు కు ఏ విధంగా చూసిన ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే అది తెలంగాణా రాష్ట్ర సమితికి లాభమే కానీ నష్టం అయితే కాదు అనేది విశ్లేషకుల మాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *