బండి సంజయ్ పైన ఆధిపథ్యం కోసం గంగుల కమలాకర్ వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడా ?

బండి సంజయ్ పైన ఆధిపథ్యం కోసం గంగుల కమలాకర్ వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడా

అవునననే అనుకుంటున్నారు కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ హిందూ ఓటర్లకు దగ్గర కావడానికి ఏక్తా యాత్రలు, హనుమాన్ జయంతి చేసినట్టు గంగుల కమలాకర్ వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడు అని ప్రజలు చెవులు కోరుకుక్కుంటున్నారు కానీ అందులో ఎంత మాత్రము వాస్తవం లేదు

వెంకటేశ్వర స్వామీ అంటే గంగులకు అపారమైన భక్తి ప్రతి యేటా రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం లో పోయిన ఏడాది గంగుల కమలాకర్ సఫలీకృతుడు అయినాడు

అదేవిధంగా ఈ సారి కూడా బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు సన్నిహితులు చెప్పే మాట ఏంటంటే ప్రతీ సంవత్సరం ఇదే విధంగా కనీ వినీ ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెపుతున్నారు

గత ఎన్నికలలో కరీంనగర్ ప్రజలు స్పృష్టమైన తీర్పునిచ్చారు ఇంకా హిందువులను అడ్డంపెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలనుకోవటం గంగుల కమలాకర్ చేయడు అనేది సన్నిహితుల మాట

ఏది ఏమైనా తెలంగాణా లో ఎక్కడ లేని విధంగా హిందువులను వాడుకోవటం లో కరీంనగర్ రాజకీయనాయకులు ముందువరుసలో ఉన్నారనేది అతియోశక్తి కాదు, కరీంనగర్ ప్రజలు సున్నిత మనస్తత్వం కలిగిన వారు కావడం అనేది వారి వారి రాజకీయ ప్రయోజనాలకు లబ్ది చేకూరుతున్నది అనేది మాత్రం వాస్తవం

వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు కరీంనగర్ లో జరగడం కరీంనగర్ ను తిరుపతి ల విద్యుత్ దీపాలతో అలకరించడం కలియుగ వెంకటేశ్వర స్వామియే కరీంనగర్ వచ్చిండా అన్నట్టు ఇవన్నీ కరీంనగర్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఈ విషయం లో మాత్రం గంగుల కమలాకర్ ను మాత్రం అభినందించాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *