You are here

గుంటూరు నుండి వైస్సార్సీపీ తరుపున పోటీచేయనున్న నాగార్జున ?

తెలంగాణ కన్నా ఏపీ లో రాజకీయాలు రోజు రోజు కి రసవత్తరంగా మారుతున్నాయి. ఒక వైపు జనసేన మరోవైపు టీడీపీ ఇంకొక్కవైపు వైసీపీ. ఈ మూడు పార్టీలు ఏపీ రాజకీయాలను ఆసక్తికంగా మార్చేశాయి.

ఈరోజు టాలీవూడ్ మన్మథడు ప్రముఖ హీరో నాగార్జున అక్కినేని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఆంధ్రాప్రదేశ్ లో ఆసక్తి రేపుతోంది నాగార్జున గారు రాజకీయాల్లోకి వస్తారో రారో తెలియదు. గత కొంత కాలంగా వైసీపీ తో నాగార్జున కు చాల దగ్గర సంబంధాలు ఉన్నాయి. కానీ వీరిద్దరి భేటీ తరువాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి

1. నాగార్జున గుంటూరు నుండి పోటీ చేస్తారని
2. నాగార్జున తన స్నేహితుడి సీటు కోసం జగన్ ను కలిసారని
3. గుంటూరు ఎంపీ టిక్కెటు తన కుటుంబ సబ్యులకు కావాలని
4. తన మిత్రుడైన పారిశ్శ్రమికవేత్త సీటు కోసం కలిసారని
5. మర్యాదపూర్వకంగా కలిసారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి

ఫిబ్రవరి నెల ఆఖరున జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్నారు కావున ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో నిమగమైయున్నారు దింట్లో భాగంగానే టాలీవుడ్ హీరో నాగార్జున జగన్ ను కలిసి తన ప్రయత్నాలను మమ్మురం చేసారు

Leave a Reply

Top