You are here

కమిషన్ లు అడిగే నాయకులను చెప్పు పట్టి కొట్టండి అంటున్న కొప్పుల ఈశ్వర్

ధర్మపురి నియోజకవర్గం లో తనను ఓటమి అంచుల దాకా తీసుకపోయిన నేతల పై ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ వివరించాడు తన పక్కన ఉన్న కొంత మంది దొంగలే నాకు తక్కువ ఓట్లు రావడానికి గల కారణమని న దగ్గరే ఉండి లక్షలు సంపాదించుకొని పదవులు అనుభవించి చివరాఖరుకు నన్నే బఫును చేసారని బాధపడ్డారు

న దగ్గర ఉన్న వ్యక్తులే ఎన్నికల సమయం లో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసారని అంతే కాకుండా సాయం కావాల్సిన పేదవారికి నేను పెద్దమనసు తో సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కల్యాణ లక్ష్మి వంటి చెక్కులు ఇప్పిస్తే నా దగ్గర వ్యక్తులే కమిషన్ల కు కక్రుత్తి పడి వారి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు

ఒక్కో సబ్సిడీ ట్రాక్టర్ లబ్బిధారుల దగ్గర లక్షల రూపాయలు వసూల్ చేసి తనపరువు మొత్తం తీసారని తన పక్కన కూర్చున్న దొంగ నాయకుల గురించి వివరించాడు

Leave a Reply

Top